7, నవంబర్ 2009, శనివారం

ఇస్లాం అపార్ధాల మబ్బుల్లో

ముహమ్మద్ కుత్బ్ ఈజిప్ట్ కి చెందిన గొప్ప ఇస్లామీయ తత్వవేత్త. ప్రాచ్య, పాశ్చాత్య శాస్త్రాలను ఆకళింపు చేసుకున్న మహామేధావి. ఆధునిక వైగ్ఞానిక ప్రగతి, దాని పర్యవసానాలు, పరిణామాలను సూక్ష్మ దృష్టితో తిలకించి విశ్లేషించిన ద్రష్ట. ఇస్లాం తత్వాన్ని ఆధునిక శైలిలో, నేటి యువతరానికి అర్ధమయ్యే శాస్త్రీయ భాషలో బోధించిన విజ్ఞాని.
ఆధునిక విద్యావంతులైనవారు అధికంగా తీవ్ర మతపరమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మతం వాస్తవానికి మానవ జీవితానికి సంబంధించిన యదార్థమా ? గతంలో ఇది యదార్థమే కావచ్చు. కాని నేడు సైన్సు మానవ జీవన స్రవంతి దిశనే పూర్తిగా మార్చివేసిన ఈ రోజుల్లోనూ, జీవితంలో సైన్సు చెప్పే యదార్ధాలకే తప్ప మరి దేనికీ తావులేని ఈ కాలంలోనూ ఆ వాదన సరైనదేనా ? మతం మనిషి సహజమైన అవశ్యకతా ?
ఆధునిక విద్యావంతులకు ఇస్లాం కేవలం ఒక విశ్వాసం కాదని ఇంకా అది అథ్యాత్మిక పరిశుథ్థత, మానవీయ సద్గుణాల నిర్మాణం, వాటి సంస్కరణల వరకే పరిమితం కాదని, అది సర్వతోముఖ, సమన్విత ఏకాంకమని, అందులో న్యాయవంతమైన ఆర్ధిక విధానం, సమతూకం, సామరస్యం గల సామాజిక వ్యవస్ధ, సివిల్, క్రిమినల్, అంతర్జాతీయ శాసనాలు, నియమ నిబంధనలు, ప్రత్యేక జీవనతత్వం, శారీరక శిక్షణకై విశేషమైన ఏర్పాట్లు ఉన్నాయని, ఇవన్నీ దాని మౌలిక విశ్వాసానికి, నైతిక ఆథ్యాత్మిక స్వభావానికి ఉద్భవించిన కొమ్మలూ రెమ్మలే అని అంటే ఈ సోదరులకు విడదీయరాని చిక్కు ఎదురౌతుంది. వారి ప్రకారం ఇస్లాం తన శక్తినీ ప్రయోజనాన్ని శాశ్వతంగా కోల్పోయి చాలా కాలమయిపోయింది. అది ఇప్పుడు దాదాపు భూతలం నుండి చిరకాలానికి కనుమరుగైపోయింది.
వారితో ఇస్లాం మృత ధర్మం కాదు సజీవమైన, శక్తి మాన్యమైన, ఎదుగుతూ, పుష్పిస్తూ, ఫలిస్తూ ఉన్న జీవనవ్యవస్థ అని, ఇందులో ఉన్న ఆరోగ్యవంతమైన అంశాలు సోషలిజంలో గాని, కమ్యూనిజంలో గాని, మరే ఇజంలో గాని ప్రాప్తం కావని అన్నప్పుడు వారి సహనం కట్టలుతెంచుకుంటుంది.
వారు విరుచుకుపడతారు "నీవు ఇదంతా ఏ మతం గురించి చెబుతున్నావు ? బానిసత్వాన్ని, భూస్వామ్య వ్యవస్ధను, పెట్టుబడిదారీని ధర్మసమ్మతం చేసిన ధర్మం గురించేనా ? స్త్రీని పురుషుడిలో సగం అని బోధించి ఆమెను ఇంటి నాలుగు గోడల మధ్య బంధించే మతం గురించేనా ? రాళ్ళు రువ్వి చంపడం, చేతులు నరకడం, కొరడా దెబ్బలు - ఇలాంటి అమానుషమైన శిక్షలు విధించే మతం గురించేనా ? ------ ఈ ఇస్లాం -- గురించేనా నీవు ఇవన్నీ చెప్పేది ? ఇది ప్రగతిని సాధించటం, భావిలో కొంగ్రొత్త విజయాలను పొందటం సుదూరవిషయాలు. మాకైతే ఇప్పుడు దీని ఉనికికే తీవ్రమైన ప్రమాదం గోచరిస్తుంది. నేటి ప్రపంచంలో, విభిన్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థల మధ్య సైధ్ధాంతిక సంఘర్షణ జరుగుతున్న ఈ తరుణంలో, ఇస్లాం లాంటి బూజుపట్టిన మతం మనగగలటం, అది విజయవంతం అన్న ప్రశ్నే తలెత్తదు."

1. ఈ "విద్యావంతుల"యిన అశంకావాదుల్ని వారి వాస్తవరూపురేఖలను,
2. ఈ అశంకలకు అనుమానాలకు మూలమేదో, ఉత్భవస్థానమేదో,
3. వీరి ఉద్ఘోషణా తీరు, వీరి స్వతంత్ర ఆలోచనల, పరిశీలనల ఫలితమా లేక ఇతరుల అంధాసురణ వల్ల జనించిందా ?
4. వీరు ఇస్లాం గురించి వ్యక్త పరిచే సందేహాలు, సంశయాలు వీరి స్వతంత్ర అనుశీలనల ద్వారా వీరి మస్తిష్కాల్లో ఉత్భవించినవా లేక ఇతరుల అరువు ప్రశ్నలా ????????

ఇటువంటి ప్రశ్నలను, సందేహాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.....

ఇస్లాం అపార్ధాల మబ్బుల్లో

28, అక్టోబర్ 2009, బుధవారం

స్వచ్ఛమైన ధర్మం

  ఫ్రతి ఒక్క మతము, కులం, తెగ, తత్వము, సిధ్ధాంతము కేవలం తమది మాత్రమే మానవులు అనుసరించదగిన సరియైన మార్గం అని చేసే వాదనలను చూసి, సత్యాన్వేషకులు తరచుగ అయోమయ స్థితికి చేరుకుంటారు. నిజంగా అవన్ని ప్రజలను మంచి పనులు చేయమనే ప్రోత్సహిస్తుంటాయి. కనుక, వాటిలో ఏది స్వచ్ఛమైనది ? ఇంకా వాటిలో ప్రతిదీ ఇతరులను అసత్యమార్గాలుగ వాదిస్తున్నందువలన అవన్ని ఏక కాలంలో స్వచ్ఛమైనవి, సత్యమైనవి కాజాలవు. ఇటువంటి గందరగోళ స్థితిలో సత్యాన్వేషకులు ఎలా స్వచ్ఛమైన మరియు సరియైన మార్గాన్ని ఎన్నుకోగలరు ?
  ఈ చిరు పుస్తకం ఇస్లాం ధర్మప్రకటనలోని ప్రామాణికతను, స్వచ్ఛతను నిరూపించే సాక్ష్యాధారాలు కొన్నింటిని మీ ముందు ఉంచటానికి ప్రయత్నిస్తున్నది. నిజాన్ని కప్పివేసే పక్షపాతం, భావోద్వేగం, జాత్యహంకారం మొదలైన వాటికి గురికాకుండ పూర్తి ఏకాగ్రత మరియు నిజాయితీతో సత్యాన్వేషణ కొనసాగిస్తేనె స్వచ్ఛమైన దైవధర్మ మార్గాన్ని కనుక్కోగలం.

27, అక్టోబర్ 2009, మంగళవారం

ఓ సత్యప్రియులారా

  సృష్టికర్త మనకు ప్రసాదించిన బుధ్ధిజ్ఞానాలను ఉపయోగించి విభిన్న మతాలలో స్వచ్ఛమైన సత్య మతం ఏది ? అని పరిశీలించి దానిని అవలంభించటంలోనే మన ఇహపర లోకాల సాఫల్యం దాగియున్నది.
  ఈ లోకంలో వ్యాపించి ఉన్న అనేక మతాలలో క్రైస్తవ మతం కూడా ఒకటి. ఈ మతం బోదించే మౌలిక విశ్వాసాలు ఏవి ? అవి ఎంతవరకు స్వీకారయోగ్యమైనవి ? నేటి క్రైస్తవ విశ్వాసాలను పరిశుధ్ధ గ్రంధం ధ్రువీకరిస్తుందా ? లేదా ?
మానవుడు నిజంగానే పుట్టుకతోనే పాపాత్ముడా ?
యేసు దేవుడి ఏకైక కుమారుడా ?
యేసు సర్వమానవాళిని రక్షించుట కొరకు అవతరించబడ్డారా ? 
క్రైస్తవుల విశ్వాసాలు పరిశుధ్ధ గ్రంధం వెలుగులో...

ఇస్లాం పై ముస్లిమేతరుల ప్రశ్నలకు సమాధానాలు

  ఇస్లాం పురుషులకు నలుగురిని వివాహం చేసుకొనే హక్కు ఎందుకు కల్పించింది ? ముస్లిములు జీవహింస ఎందుకు చేస్తారు ? ఇస్లాం ధర్మంలో పంది మాంసం మరియు మత్తుపానీయాలు ఎందుకు నిషేధించబడ్డాయి ? అన్ని మతాలు మంచినే బోధిస్తాయి కదా మరి ఇస్లాం ధర్మమును ఎందుకు స్వీకరించాలి ?
  ముస్లిమేతరుల మదిలో కలిగే ఇటువంటి ఇరవై ప్రశ్నలకు డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఆథ్యాత్మిక మరియు శాస్త్రీయ గ్రంధాల నుండి ఆధారాలు చూపించారు. ఈ పుస్తకం ముస్లింలకు మరియు ముస్లిమేతరులకు ఇస్లాం పై ఉన్న అపోహలను దూరం చేయటానికి ఉపయోగపడుతుంది.

ఇస్లాం పై ముస్లిమేతరుల ప్రశ్నలకు సమాధానాలు

25, అక్టోబర్ 2009, ఆదివారం

మస్నూన్ నమాజ్

  అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం గారు "మీరు నన్ను ఏ విధంగానైతే నమాజ్ చేస్తుండగా చూశారో మీరు కూడ అదే విధంగ నమాజ్ చేయండి -- బుఖారి" అని ప్రబోధించారు. ఇస్లాం ధర్మంలో అత్యంత ప్రధానమైనది నమాజ్. ఈ పుస్తకంలో నమాజుకు (పండుగ నమాజ్, జుమా నమాజ్, ఇష్రాక్, చాష్త్, జనాజా నమాజ్ మొదలగునవి) సంబంధించిన విషయాలను చాలా సంక్షిప్తంగా సంకలనం చేయబడ్డాయి.

మస్నూన్ నమాజ్

ఆదర్శమూర్తి -- ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం

  కాలగతిని మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాఙ్ఞానులుగా చేసిన అద్వితీయ సంస్కర్త, బానిసల్ని పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక సందేశాన్ని - ఇస్లాం సందేశాన్ని - లోకానికి పరిచయం చేసిన మహోపకారి అయిన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం జీవిత చరిత్ర తెలియజేసే పుస్తకం.

24, అక్టోబర్ 2009, శనివారం

ముస్లిముల ధార్మిక విశ్వాసం

     ఈ పుస్తకంలో ప్రశ్నోత్తరాల రూపంలో ముస్లింల ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ముఖ్యవిశయాలు చర్చింపబడ్డాయి. ధార్మిక విశ్వాసంతో పాటు ఆచరణ కూడ తప్పనిసరి. ఎందుకంటే ఆచరణ లేకుండా సాఫల్యం సాధ్యం కాదు. విశ్వాసం సవ్యదిశలో ఉన్నప్పుడే ఆచరణలు కూడ సవ్యదిశలో ఉంటాయి. విశ్వాసం విషయంలో మనిషి ఏ మాత్రం ఏమరపాటు వహించనా అనేక రకాలైన అపనమ్మకాలు, అనుమానాలు, వైముఖ్యభావాలు అతని మనసులో అతనికి తెలియకుండ తిష్టవేస్తాయి. ఈ విధంగ అతడు మార్గభ్రష్టత్వంలోకి నెట్టివేయబడతాడు. కాబట్టి మనం మన విశ్వాసాలను, ఆలోచనలను దైవగ్రంధం ఖుర్ ఆన్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం సంప్రదాయాలకు అనుగుణంగా మలచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ముస్లిముల ధార్మిక విశ్వాసం

21, అక్టోబర్ 2009, బుధవారం

అంతిమ దైవ గ్రంధం ఖుర్ ఆన్ -- అహ్ సనుల్ బయాన్ -- తెలుగు అనువాదము

  ఖుర్ ఆన్ గ్రంధం విశ్వప్రభువు అయిన అల్లాహ్ సర్వమానవాళికొరకు అవతరింపజేసిన అంతిమ దైవగ్రంధం.
  ఉర్దూ భాషలో ముహమ్మద్ జునాగడీ గారు ఖుర్ ఆన్ గ్రంధమును "అహ్ సనుల్ బయాన్" గ అనువదించగా హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ గారు వ్యాఖ్యానం చేసారు. ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతి మార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వీరి అనుమతి లేనిదే ఎవరు దీనిని ముద్రించరాదు.

ఆచార దురాచారాలు

  మీలాదున్ నబీ, శబ్ ఎ మేరాజ్, శబ్ ఎ ఖదర్ వంటి సమావేశాలు ఇస్లాం ధర్మం లొ భాగమా లేక అవి కొత్తపోకడలా(బిద్ అత్)?        
  విశ్వవిఖ్యాత పండితులు షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ గారి ఫత్వాల నుండి వీటి వాస్తవికతను, వీటికి ఇస్లాం ధర్మంలో చోటున్నదా వంటి విశయాలను సేకరించబడినది.
  ఈ సమావేశాల వాస్తవికతతో పాటు కట్టు కథలు(దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లమ్ ను నిద్రావస్థలో చూడటం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లమ్ వసీయతు చేయటం) మరియు షరియత్ వెలుగులో ఫోటోగ్రఫి గురించి కూడ చర్చించటం జరిగింది.

ఆచార దురాచారాలు

17, అక్టోబర్ 2009, శనివారం

హదీసు మకరందం -- బులూఘుల్ మరాం (రెండవ సంపుటం)

 ప్రఖ్యాత పండితులు, ధర్మ శాస్త్ర కోవిదులు అబుల్ ఫజల్ అహ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ హజర్ అస్ఖలానీ గారి విశ్వ విఖ్యాత హదీసు గ్రంథం బులూఘుల్ మరాం.
 గ్రంథ రచయిత ధర్మాదేశాలను, దైనందిన జీవితంలో ఒక మనిషికి ఎదురయ్యే ధర్మసందేహాలకు సంబంధించిన హదీసులను ఈ పుస్తకంలో క్రోఢీకరించినారు. ప్రతి వ్యక్తీ వీటిని తెలుసుకోవటం ఎంతైన అవసరం. హదీసుకు సంబంధించిన ఈ గ్రంథం సంక్షిప్తమైనప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలలోని సారాంశమంతా చక్కగా సమకూర్చటం జరిగింది.

హదీసు మకరందం -- బులూఘుల్ మరాం (రెండవ సంపుటం)

హదీసు మకరందం -- బులూఘుల్ మరాం (మొదటి సంపుటం)

 ప్రఖ్యాత పండితులు, ధర్మ శాస్త్ర కోవిదులు అబుల్ ఫజల్ అహ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ హజర్ అస్ఖలానీ గారి విశ్వ విఖ్యాత హదీసు గ్రంథం బులూఘుల్ మరాం.
 గ్రంథ రచయిత ధర్మాదేశాలను, దైనందిన జీవితంలో ఒక మనిషికి ఎదురయ్యే ధర్మసందేహాలకు సంబంధించిన హదీసులను ఈ పుస్తకంలో క్రోఢీకరించినారు. ప్రతి వ్యక్తీ వీటిని తెలుసుకోవటం ఎంతైన అవసరం. హదీసుకు సంబంధించిన ఈ గ్రంథం సంక్షిప్తమైనప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలలోని సారాంశమంతా చక్కగా సమకూర్చటం జరిగింది.

హదీసు మకరందం -- బులూఘుల్ మరాం (మొదటి సంపుటం)

హదీసు కిరణాలు -- రియాజుస్సాలిహీన్ (రెండవ సంపుటం)

 రియాజుస్సాలిహీన్ అనేది ఓ విశ్వ విఖ్యాత హదీసు సంకలనం. క్రీ.శ. 7 వ శతాబ్ధంలో ప్రఖ్యాత ఇస్లాం తత్వవేత్త, విద్వాంసులు అబూ జకరియా యహ్యా బిన్ షరఫ్ నవవి (రహ్మతుల్లాహ్ అలైహ్) గారి చేత సంకలనం చేయబడిన ఈ హదీసు గ్రంధం నేటికి కూడా ముస్లిం సమాజంలో గొప్ప ఆదరణకు నోచుకుంటోంది.
 దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను అనుసరించనిదే ఎవరూ ఇస్లాం పరిదిలో ఉండలేరు. ఒక వ్యక్తి ముస్లిం అవటానికి అతను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం అడుగుజాడల్లో నడవటం చాలా అవసరం. హదీసు ఙ్ఞానఖనుల్లో పరివ్యాప్తమై ఉన్న వేలాది హదీసులనుంచి దేవుని హక్కులు, దాసుల హక్కులు, ఆచరణల మహత్యం, చెడుల పట్ల ఏవగింపు, ఆత్మ నిగ్రహం, ధార్మిక - ప్రాపంచిక కర్తవ్యాల మధ్య సమతౌల్యం మొదలగు విషయాలకు సంబంధించిన హదీసులు వివిధ శీర్షికల క్రింద పొందుపరచబడ్డాయి.

హదీసు కిరణాలు -- రియాజుస్సాలిహీన్ (రెండవ సంపుటం)

హదీసు కిరణాలు -- రియాజుస్సాలిహీన్ (మొదటి సంపుటం)

 రియాజుస్సాలిహీన్ అనేది ఓ విశ్వ విఖ్యాత హదీసు సంకలనం. క్రీ.శ. 7 వ శతాబ్ధంలో ప్రఖ్యాత ఇస్లాం తత్వవేత్త, విద్వాంసులు అబూ జకరియా యహ్యా బిన్ షరఫ్ నవవి (రహ్మతుల్లాహ్ అలైహ్) గారి చేత సంకలనం చేయబడిన ఈ హదీసు గ్రంధం నేటికి కూడా ముస్లిం సమాజంలో గొప్ప ఆదరణకు నోచుకుంటోంది.
 దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను అనుసరించనిదే ఎవరూ ఇస్లాం పరిదిలో ఉండలేరు. ఒక వ్యక్తి ముస్లిం అవటానికి అతను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం అడుగుజాడల్లో నడవటం చాలా అవసరం. హదీసు ఙ్ఞానఖనుల్లో పరివ్యాప్తమై ఉన్న వేలాది హదీసులనుంచి దేవుని హక్కులు, దాసుల హక్కులు, ఆచరణల మహత్యం, చెడుల పట్ల ఏవగింపు, ఆత్మ నిగ్రహం, ధార్మిక - ప్రాపంచిక కర్తవ్యాల మధ్య సమతౌల్యం మొదలగు విషయాలకు సంబంధించిన హదీసులు వివిధ శీర్షికల క్రింద పొందుపరచబడ్డాయి.

హదీసు కిరణాలు -- రియాజుస్సాలిహీన్ (మొదటి సంపుటం)

లేదా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

హదీసు కిరణాలు -- రియాజుస్సాలిహీన్ (మొదటి సంపుటం)

నమాజు పుస్తకం -- కితాబుస్సలాహ్

 నమాజు ఇస్లాం ధర్మం యొక్క చాలా గొప్ప ప్రాముఖ్యత గల మూల స్థంభము మరియు అల్లాహ్ తో సంబంధమును స్థిరపరచు మధ్యవర్తి.    
  మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం గారు నమాజును తమ కండ్లకు చలువ అని ప్రవచించినారు. ఖురాన్ మరియు హదీసు వెలుగులో నమాజు ఏవిధంగ ఆచరించాలో తెలియజేసే పుస్తకం....

నమాజు పుస్తకం -- కితాబుస్సలాహ్

లేదా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

నమాజు పుస్తకం -- కితాబుస్సలాహ్

ఏకదైవారాధన -- కితాబుత్తౌహీద్

  అల్లాహ్ ఒక్కడే సత్యదేవుడని, అల్లాహ్ తప్ప వేరేయెవరూ ఆరాధనకర్హులు లేరని, ఆయన వ్యక్తిత్వంలోను, గుణవిశేషాల్లోను ఒక్కడేనని, ఆయనకెవరూ సాటి లేరని విశ్వసించటం ఏకదైవారాధన అనబడుతుంది. ఏకదైవారాధన విశ్వాసం వలన, ప్రళయదినాన విశ్వాసుల పాపాలన్నీ సమసిపోయి, దైవ సంతుష్టం ప్రాప్తమౌతుంది.   
  సత్య దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఈ విధంగా ఉపదేశించారు: ఏ వ్యక్తియైనా సరే లా ఇలాహ ఇల్లల్లాహ్ అను పవిత్ర పదమునందు విశ్వాసం కలిగి ఉండి, అనగా అల్లాహ్ ఒక్కడే సత్య దేవుడని, అల్లాహ్ తప్ప వేరే ఎవరూ ఆరాధనకర్హులు కాజాలరని విశ్వసించి, స్థిరంగా ఉండి అదే విశ్వాస స్థితిలో మరణిస్తే అతడు తప్పకుండా స్వర్గప్రవేశం పొందగలడు.....

ఏకదైవారాధన -- కితాబుత్తౌహీద్

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

ఏకదైవారాధన -- కితాబుత్తౌహీద్

హజ్, ఉమ్రా మరియు జియారత్ విధానము

  అరబి భాషలో ప్రఖ్యాత పండితుడు, తత్వవేత్త షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ గారు రచించిన "హజ్, ఉమ్రాహ్ మరియు జియారత్ విధానము" అనే పుస్తకాన్ని తెలుగులో ముహమ్మద్ అల్ ఉమరి అబూ అబ్డుల్లాహ్ గారు తెలుగులో అనువదించినారు. ఈ పుస్తకంలొ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగ హజ్, ఉమ్రహ్ మరియు జియారత్(దివ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం గారి మసీదును సందర్శించుట) విధానము తెలియజేయబడింది.

హజ్, ఉమ్రా మరియు జియారత్ విధానము

14, అక్టోబర్ 2009, బుధవారం

హజ్ ఉమ్రా ఆదేశాలు


 ఇస్లాం ధర్మం మూలస్థంభాలలో హజ్ ఐదవ స్తంభము. హజ్, ఉమ్రా యాత్రలకు సంబంధించి వివరాలు తెలియజేసే చిరు పుస్తకం.

హజ్ ఉమ్రా ఆదేశాలు

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

హజ్ ఉమ్రా ఆదేశాలు

13, అక్టోబర్ 2009, మంగళవారం

తౌహీద్ ప్రబోధిని

 తౌహీద్ విశ్వాసం ఇస్లాం ధర్మానికి పునాది వంటిది. ఏ విధంగానైతే ఒక భవనం పునాది లేకుండ నిలబడలేదో అదే విధంగా తౌహీద్ లేకుండ ఇస్లాం ధర్మకట్టడం నిలబడజాలదు. ఆదం ప్రవక్త (అలైహిస్సలాం) నుంచి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం వరకు ప్రవక్తలందరి సందేశం తౌహీదే (ఏకదైవారాధనే). సత్యాసత్యాల మధ్య ఘర్షణలు, దైవ విరోధం - ఇస్లాంల మధ్య యుధ్ధాలు, దైవప్రవక్త అనుచరుల వీరమరణాలు, ప్రవక్తల మీద కష్టాల కొండలు ఈ తౌహీద్ మూలంగానే వచ్చిపడ్డాయి.
 ఈనాడు మనిషి తౌహీద్ కు దూరమవటం మూలంగానే మానవత్వానికి, సహజత్వానికి దూరమైపోతున్నాడు. తౌహీద్ సందేశాన్ని పునరుజ్జీవింపచేయటం ద్వార ఆ అగాధాన్ని పూరించవచ్చు.  

తౌహీద్ ప్రబోధిని

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

తౌహీద్ ప్రబోధిని

12, అక్టోబర్ 2009, సోమవారం

రమజాన్ నెలలో రఫీ ఏమి చేస్తాడు ?

 ఐదవ తరగతి చదువుతున్న రఫీ అనే బాలుడు రమజాన్ నెలలొ చేసే దినచర్యలను తెలిపే ఓ కల్పిత కథ

రమజాన్ నెలలో రఫీ ఏమి చేస్తాడు ?

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

రమజాన్ నెలలో రఫీ ఏమి చేస్తాడు ?

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

జీసస్ మరియు ముహమ్మద్ (సఅసం) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

  ఈ పుస్తకం జీసస్ (ఈస అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిన ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చుతుంది.

దేవుడే మానవుడిగా మారినాడా?

  దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. -- ఎ.బి. ఫిలిప్స్

దేవుడే మానవుడిగా మారినాడా?

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

దేవుడే మానవుడిగా మారినాడా?

ఖుర్ఆన్ మరియు సైన్సు

స్వచ్ఛమైన, సత్యమైన ఇస్లాం ధర్మం గురించి, ముస్లింల గురించి, ఇస్లాంలోని ఇతర ముఖ్యవిషయాల గురించి తెలుసుకోగోరిన ముస్లిమేతరులకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

ఖుర్ఆన్ మరియు సైన్సు

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

ఖుర్ఆన్ మరియు సైన్సు

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మీలాదున్ నబీ ముస్లింల పండుగేనా?!

అఙ్ఞానం వలన, సరియైన అవగాహన లేనందు వలన అనేక మంది మార్గభ్రష్ఠులై కొత్త పోకడలను (బిద్ అత్) దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం గారి సున్నత్ గ భావిస్తున్నారు. అటువంటి కొత్త పోకడ లలో ఒకటి మిలాదున్ నబి. అందువలన మిలాదున్ నబి వాస్తవికత ఏమిటొ తెలుసుకోవలసిన అవసరం ఎంతైన ఉన్నది. మిలాదున్ నబి యొక్క వాస్తవికత తెలియజేసే చిరుపుస్తకం.

మీలాదున్ నబీ ముస్లింల పండుగేనా?!

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

మీలాదున్ నబీ ముస్లింల పండుగేనా?!

మీలాదున్ నబీ -- జునైద్ అబ్దుల్లాహ్ ల సంభాషణ

మిలాదున్ నబి యొక్క వాస్తవికత పై జునైద్ మరియు అబ్దుల్లాహ్ ల ఆసక్తికరమైన సంభాషణ.


మీలాదున్ నబీ -- జునైద్ అబ్దుల్లాహ్ ల సంభాషణ

లేదా క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

మీలాదున్ నబీ -- జునైద్ అబ్దుల్లాహ్ ల సంభాషణ