ముహమ్మద్ కుత్బ్ ఈజిప్ట్ కి చెందిన గొప్ప ఇస్లామీయ తత్వవేత్త. ప్రాచ్య, పాశ్చాత్య శాస్త్రాలను ఆకళింపు చేసుకున్న మహామేధావి. ఆధునిక వైగ్ఞానిక ప్రగతి, దాని పర్యవసానాలు, పరిణామాలను సూక్ష్మ దృష్టితో తిలకించి విశ్లేషించిన ద్రష్ట. ఇస్లాం తత్వాన్ని ఆధునిక శైలిలో, నేటి యువతరానికి అర్ధమయ్యే శాస్త్రీయ భాషలో బోధించిన విజ్ఞాని.
ఆధునిక విద్యావంతులైనవారు అధికంగా తీవ్ర మతపరమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మతం వాస్తవానికి మానవ జీవితానికి సంబంధించిన యదార్థమా ? గతంలో ఇది యదార్థమే కావచ్చు. కాని నేడు సైన్సు మానవ జీవన స్రవంతి దిశనే పూర్తిగా మార్చివేసిన ఈ రోజుల్లోనూ, జీవితంలో సైన్సు చెప్పే యదార్ధాలకే తప్ప మరి దేనికీ తావులేని ఈ కాలంలోనూ ఆ వాదన సరైనదేనా ? మతం మనిషి సహజమైన అవశ్యకతా ?
ఆధునిక విద్యావంతులకు ఇస్లాం కేవలం ఒక విశ్వాసం కాదని ఇంకా అది అథ్యాత్మిక పరిశుథ్థత, మానవీయ సద్గుణాల నిర్మాణం, వాటి సంస్కరణల వరకే పరిమితం కాదని, అది సర్వతోముఖ, సమన్విత ఏకాంకమని, అందులో న్యాయవంతమైన ఆర్ధిక విధానం, సమతూకం, సామరస్యం గల సామాజిక వ్యవస్ధ, సివిల్, క్రిమినల్, అంతర్జాతీయ శాసనాలు, నియమ నిబంధనలు, ప్రత్యేక జీవనతత్వం, శారీరక శిక్షణకై విశేషమైన ఏర్పాట్లు ఉన్నాయని, ఇవన్నీ దాని మౌలిక విశ్వాసానికి, నైతిక ఆథ్యాత్మిక స్వభావానికి ఉద్భవించిన కొమ్మలూ రెమ్మలే అని అంటే ఈ సోదరులకు విడదీయరాని చిక్కు ఎదురౌతుంది. వారి ప్రకారం ఇస్లాం తన శక్తినీ ప్రయోజనాన్ని శాశ్వతంగా కోల్పోయి చాలా కాలమయిపోయింది. అది ఇప్పుడు దాదాపు భూతలం నుండి చిరకాలానికి కనుమరుగైపోయింది.
వారితో ఇస్లాం మృత ధర్మం కాదు సజీవమైన, శక్తి మాన్యమైన, ఎదుగుతూ, పుష్పిస్తూ, ఫలిస్తూ ఉన్న జీవనవ్యవస్థ అని, ఇందులో ఉన్న ఆరోగ్యవంతమైన అంశాలు సోషలిజంలో గాని, కమ్యూనిజంలో గాని, మరే ఇజంలో గాని ప్రాప్తం కావని అన్నప్పుడు వారి సహనం కట్టలుతెంచుకుంటుంది.
వారు విరుచుకుపడతారు "నీవు ఇదంతా ఏ మతం గురించి చెబుతున్నావు ? బానిసత్వాన్ని, భూస్వామ్య వ్యవస్ధను, పెట్టుబడిదారీని ధర్మసమ్మతం చేసిన ధర్మం గురించేనా ? స్త్రీని పురుషుడిలో సగం అని బోధించి ఆమెను ఇంటి నాలుగు గోడల మధ్య బంధించే మతం గురించేనా ? రాళ్ళు రువ్వి చంపడం, చేతులు నరకడం, కొరడా దెబ్బలు - ఇలాంటి అమానుషమైన శిక్షలు విధించే మతం గురించేనా ? ------ ఈ ఇస్లాం -- గురించేనా నీవు ఇవన్నీ చెప్పేది ? ఇది ప్రగతిని సాధించటం, భావిలో కొంగ్రొత్త విజయాలను పొందటం సుదూరవిషయాలు. మాకైతే ఇప్పుడు దీని ఉనికికే తీవ్రమైన ప్రమాదం గోచరిస్తుంది. నేటి ప్రపంచంలో, విభిన్న సామాజిక, ఆర్ధిక వ్యవస్థల మధ్య సైధ్ధాంతిక సంఘర్షణ జరుగుతున్న ఈ తరుణంలో, ఇస్లాం లాంటి బూజుపట్టిన మతం మనగగలటం, అది విజయవంతం అన్న ప్రశ్నే తలెత్తదు."
1. ఈ "విద్యావంతుల"యిన అశంకావాదుల్ని వారి వాస్తవరూపురేఖలను,
2. ఈ అశంకలకు అనుమానాలకు మూలమేదో, ఉత్భవస్థానమేదో,
3. వీరి ఉద్ఘోషణా తీరు, వీరి స్వతంత్ర ఆలోచనల, పరిశీలనల ఫలితమా లేక ఇతరుల అంధాసురణ వల్ల జనించిందా ?
4. వీరు ఇస్లాం గురించి వ్యక్త పరిచే సందేహాలు, సంశయాలు వీరి స్వతంత్ర అనుశీలనల ద్వారా వీరి మస్తిష్కాల్లో ఉత్భవించినవా లేక ఇతరుల అరువు ప్రశ్నలా ????????
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి