27, అక్టోబర్ 2009, మంగళవారం

ఓ సత్యప్రియులారా

  సృష్టికర్త మనకు ప్రసాదించిన బుధ్ధిజ్ఞానాలను ఉపయోగించి విభిన్న మతాలలో స్వచ్ఛమైన సత్య మతం ఏది ? అని పరిశీలించి దానిని అవలంభించటంలోనే మన ఇహపర లోకాల సాఫల్యం దాగియున్నది.
  ఈ లోకంలో వ్యాపించి ఉన్న అనేక మతాలలో క్రైస్తవ మతం కూడా ఒకటి. ఈ మతం బోదించే మౌలిక విశ్వాసాలు ఏవి ? అవి ఎంతవరకు స్వీకారయోగ్యమైనవి ? నేటి క్రైస్తవ విశ్వాసాలను పరిశుధ్ధ గ్రంధం ధ్రువీకరిస్తుందా ? లేదా ?
మానవుడు నిజంగానే పుట్టుకతోనే పాపాత్ముడా ?
యేసు దేవుడి ఏకైక కుమారుడా ?
యేసు సర్వమానవాళిని రక్షించుట కొరకు అవతరించబడ్డారా ? 
క్రైస్తవుల విశ్వాసాలు పరిశుధ్ధ గ్రంధం వెలుగులో...

2 కామెంట్‌లు:

  1. వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చేప్పబడదు.

    రిప్లయితొలగించండి
  2. పూనురి రమేష్ ( ఎఫ్. డబ్లు .బి .డి. యన్)
    హెడ్ మాస్టర్
    స్కూల్ ఫర్ డెఫ్
    అయ్యా మీరు ఈ వాక్యములు చదివి అత్యస్చార్యం పొందారు. ఐతే నేను (నిసా -౧౭౧ ) అనే గ్రంధంను రచించిన వారి కాలమును చూచి నేను ఆశ్చర్య పోయాను. అప్పటికే బైబిల్ గ్రంధము వ్రాయడం ముగించి ఐదు వందల పది సంవత్సరాలు కావడమే క్రీస్తు శకం ఆరు వందల పదియవ సంవత్సరం మొదలు పెట్టి క్రీస్తు శకం ఆరువందల యాబై నాలుగున ముగించబడిన ఖురాన్ గ్రంధంలో ఈ మాటలు చదువుతుంటే '' పిల్లోచ్చి గుడ్డును వెక్కిరించినట్టు '' అనే సామెత గుర్తు చేసుకోవలసి వస్తుంది.
    బైబిల్ క్రీస్తు పూర్వం పదిహేడు వందలవ సంవత్సరము నుండి క్రీస్తు శకం వందవ సంవత్సరము వరకు ముగించబడింది. ముప్పైతొమ్మిది మంది ప్రవక్తలు వివిద కాలాలలో '' పరిశుద్దాత్మ ''వలన ప్రేరేపింపబడినవరై దేవుని మూలముగా పలికిరి. ౨ పేతురు ౨ : ౨౧ బైబిల్ గ్రంధంలో ఈ విధంగా ఉంది :- పరిశుద్దులకు ఒక్క సారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలేనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను. యూద : ౩ ఒక్క సారే అన్న పదమును గమనించండి. పరిశుద్దులకు అంటే కేవలం క్రీస్తును నమ్మిన క్రైస్తవులకు అప్పగించబడింది.
    అదికూడా ఒక్కసారే ! రెండవదిగా : - '' పోరాడవలెను భోధ నిమిత్తము అంటే బైబిల్ నిమిత్తము '' ( జిహాద్ద్ ) మాత్రం కాదు.
    ఏసుక్రీస్తు శరీరదారియై వచ్చెనని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు . ౨ యోహాను :౭ ఎవడైనను ఈ బోధను తేక మీయొద్దకు వచ్చినయడల వానిని మీ ఇంట చేర్చుకోనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును . ౨ యోహాను ౧౦,౧౧ గమనించండి ఐదువందల పది సంవత్సరాలకు ముందే దేవుడు తన అపోస్తుల చే వ్రాయించాడు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలు తరువాత వేరే యొక బోధ వస్తుందని నాకు తెలియదు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుకు తెలుసు.
    తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పిం చినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవ ఏమియు చేయడు. ఆమోసు ౩ : ౭ ఐదు వందల సంవత్సరాల తరువాత వచ్చిన వేరొక బోధ యైన ఖురాన్ గురించి దేవుడు ఏమి చెప్పలేదు. రక రకాలైన భోధలు వచ్చి క్రైస్తవులనే పరిశుద్దులను కలవరపరచ కుండ పరిశుద్దులకు అప్పగించభడక మునుపే దేవుడు బైబిల్ గ్రంధాన్ని ముద్రించెను. ప్రకటన ౫ : ౧ మేము ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతైనను మీకు ప్రకటించినయడల అతడు శాపగ్రస్తుడవును గాక . గలతీయులకు ౧ : 8 చూడండి ! దేవుడు ఈ బోధ విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడో పై వాక్యములను చూస్తె తెలుస్తుంది. ఖురాన్ ను ఈబైబిల్ నుండే మార్చి వ్రాసారు అని ఈ క్రింది ప్రతిని చదివితే మీకే తెలుస్తుంది.
    బైబిల్ లోని కథలని ఖురాన్ లో మార్చి వ్రాయడం జరిగిందా? కంఫ్యూజ్ అయ్యి మరోలా వ్రాయడం జరిగిందా? బైబిల్ లోని అనేక కథలు ఖురాన్ లో కూడా కనిపిస్తాయి. కానీ అవి వేరే కథలతో కలిసిపోయి ఉన్నట్టు ఉంటాయి. బైబిల్ నుంచి తొలిగించిన కథలు (Biblical apocrypha) కూడా ఖురాన్ లో కనిపిస్తాయి. ఖురాన్ రచన ముహమ్మద్ ప్రవక్త బతికి ఉన్న కాలంలోనే జరిగింది, ముహమ్మదే ఖురాన్ లో అనేక మార్పులూ, చేర్పులూ చేశాడు. చదవడం, వ్రాయడం నేర్చుకున్న ముహమ్మద్ బైబిల్ వచనాలని తనకి గుర్తున్నంత వరకే ఖురాన్ లో వ్రాయించాడని Theodor Nöldeke అనే పరిశీలకుని అభిప్రాయం. కొంత మంది పరిశీలకులు ముహమ్మద్ నిరక్షరాస్యుడని భావిస్తుండగా, మరి కొందరు పరిశీలకులు ముహమ్మద్ చదువు నేర్చిన వాడైనా తనకి గుర్తున్నవి మాత్రమే వ్రాయించాడని అభిప్రాయపడుతున్నారు.
    హమాన్ ఫరావ్ (ఫిరాన్) దగ్గర మంత్రిగా పని చేశాడని, మేరీ (మర్యం) ఆరోన్ (హారూన్) కి చెల్లెలు అని ఖురాన్ లో వ్రాయడం కంఫ్యూజన్ కలిగిస్తుంది. ముహమ్మద్ యూదులు, క్రైస్తవులు దగ్గర బైబిల్ కథలు విన్నాడు కానీ వాటిని తనకి గుర్తున్నంత వరకే ఖురాన్ లో వ్రాయించాడు. కొందరు ముహమ్మద్ కి కథలు మరో రకంగా వినిపించి అతని చేత పొరపాట్లు చెయ్యించి ఉండొచ్చు. హీబ్రూ బాషలోని మిరియం అనే పేరుని అరబ్ బాషలో మర్యం అని, గ్రీక్ బాషలో మరియా అని, ఇంగ్లిష్ బాషలో మేరీ అని పలకడం జరుగుతుంది. బైబిల్ లో మిరియం (మరియ) పేరుతో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒకరు ఆహరోన్ (Aaron) & మోషే (Moses)ల సోదరి. ఇంకొకరు ఏసు క్రీస్తు తల్లి. ఖురాన్ లో ఏసు క్రీస్తు తల్లి అయిన మరియ ఆహరోన్ సోదరి అని వ్రాయడం జరిగింది. బైబిల్ కథనం ప్రకారం ఆహరోన్ కథ పాత నిబంధనలకి సంబంధించినది, ఏసు క్రీస్తు కథ కొత్త నిబంధనలకి సంబంధించినది. బైబిల్ పాత నిబంధనలు, కొత్త నిబంధనలు పూర్తిగా వేర్వేరు కాలాలలో వ్రాయబడ్డాయి. ఏసు క్రీస్తుకీ, ఆహరోన్ కీ మధ్య వందల సంవత్సరాల దూరపు సంబంధం ఉంది. అలాంటప్పుడు ఏసు క్రీస్తు తల్లి ఆహరోన్ కి సోదరి అని ఖురాన్ లో వ్రాయడం ఆలోచించాల్సిన విషయమే

    రిప్లయితొలగించండి