21, అక్టోబర్ 2009, బుధవారం

ఆచార దురాచారాలు

  మీలాదున్ నబీ, శబ్ ఎ మేరాజ్, శబ్ ఎ ఖదర్ వంటి సమావేశాలు ఇస్లాం ధర్మం లొ భాగమా లేక అవి కొత్తపోకడలా(బిద్ అత్)?        
  విశ్వవిఖ్యాత పండితులు షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ గారి ఫత్వాల నుండి వీటి వాస్తవికతను, వీటికి ఇస్లాం ధర్మంలో చోటున్నదా వంటి విశయాలను సేకరించబడినది.
  ఈ సమావేశాల వాస్తవికతతో పాటు కట్టు కథలు(దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లమ్ ను నిద్రావస్థలో చూడటం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లమ్ వసీయతు చేయటం) మరియు షరియత్ వెలుగులో ఫోటోగ్రఫి గురించి కూడ చర్చించటం జరిగింది.

ఆచార దురాచారాలు

2 కామెంట్‌లు:

  1. ముస్లింలు విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించరు.దర్గాలు, ఆషూర్ ఖానాలు, ముహర్రం పీర్ల పండుగలు,ఫాతెహా ఖ్వానీలు, కుండోంకే ఫాతెహా (రజబ్ నెలలో ఇమాం జాఫర్-ఎ-సాదిక్ మన్నత్ లేదా నోము), ఘడీ కే ఫాతెహా, చరాగోంకే ఫాతెహా (దీపాల మన్నత్), దర్గాల వద్ద 'షిఫా ఖానా' లు, చెరువులు గుంటలు, కొలనులలో మునగడం లాంటి విషయాలు, వెలసాయి. ఇలాంటి అంధవిశ్వాసాల నుండి మానవాళికి కాపాడడానికే ఇస్లాం అవతరించింది.
    * దర్గాలు
    * జెండా మానులు (జెండాలు తగిలించిన వృక్షాలు)
    * పంజాలు (మొహర్రంలో ప్రతిష్టించే పీర్లు)
    * ఔలియాల నషాన్లు (ఔలియాల పేరును తగిలించి అక్కడక్కడా ప్రతిష్ఠానాలు)
    పైనుదహరించినవన్నీ సరైన విషయాలేనని సున్నీ బరేల్వీ జమాత్, సరైనవి కావు అని తబ్లీగీ జమాత్ ప్రకటనలు చేపడుతూనేవున్నవి.

    రిప్లయితొలగించండి
  2. వ్యాఖ్యలు చేసే వారు తమ పేరు, ఎంతవరకు చదువుకున్నారు, ప్రస్తుతం ఏమి చేస్తున్నారు మరియు ఏ మతమును ఆచరిస్తున్నారో తెలియజేసి వ్యాఖ్యలు చేయాలి. లేనిచో సమాధానం చేప్పబడదు.

    రిప్లయితొలగించండి