26, సెప్టెంబర్ 2010, ఆదివారం

ఉగ్రవాదము ముస్లిముల గుత్తాధిపత్యము కాదు.

స్వామినాథన్ యస్ అన్ క్లేసరియ ఐయర్ గారి టీ యన్ యన్ జూలై 23, 2006 12:20 ఉదయం భారతకాలమాన ప్రకారం ప్రచురితమైన ప్రత్యేక వ్యాసం యొక్క తెలుగు అనువాదం.

"ముస్లిములందరు ఉగ్రవాదులు కాకపోవచ్చు. కాని ఉగ్రవాదులు అందరు ముస్లిములే" ఇటువంటి వ్యాఖ్యలు ముంబయి బాంబు పేలుళ్ళ తరువాత తరచుగా మనం వింటూ వస్తున్నాము. ఉగ్రవాదము ముస్లిముల గుత్తాధిపత్యము అని కాకపోయినా అది వారి ప్రత్యేకత అనే భావం మాత్రం దీని ద్వారా తప్పకుండ స్ఫురిస్తంది. కాని వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.


అసలు, ఉగ్రవాదము అనే మాట ప్రపంచానికి కొత్తదేమీ
కాదు.

1881 సంవత్సరంలో రష్యా చక్రవర్తి అలెగ్జాండర్-II ను అక్కడ ఉన్న మరో 21 మందిని అరాచకవాదులు హత్యచేసారు. 1901 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు మెక్ కిన్లే ను మరియు ఇటలీ రాజు హంబర్ట్-I ను అరాచకవాదులు ధారుణంగా హత్య చేశారు. ఆస్ట్రియా రాజు ఆర్క్ డ్యూక్ ఫెర్డినాండ్ ను అరాచక శక్తులు హత్య చేయడంతో 1914 లో మొదటి ప్రపంచ యుధ్ధం మొదలయింది.


ముస్లిములకు పైన పేర్కొన్న ఉగ్రవాద చర్యలతో ఏ సంబంధము లేదు.

రాజకీయ కారణాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు చేసి చంపటాన్ని ఉగ్రవాదం గా నిర్వచిస్తారు. పై నిర్వచనాన్ని అనుసరిస్తూనే బ్రిటీష్ పాలకులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారిని ఇంకా చాలామంది స్వాతంత్ర సమర యోధులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు.

వీళ్ళు హిందువులు, సిఖ్ఖులు. వీళ్ళలో ముస్లిములు ఎవరూ లేరు.

గెరిల్లా యుధ్దాలు చేసిన మావో జిదాంగ్ నుంచి హోచిమిన్హ్ మరియు ఫీడెల్ క్యాస్ట్రో వరకు మొదలగు వారందరూ తమ విప్లవ దాడుల్లో ఎంతో మంది సామాన్య ప్రజల మరణానికి కారకులయ్యారు. అధికారమును కైవసం చేసుకునే వరకు వీరి పైనా ఉగ్రవాదులనే ముద్ర ఉండేది.
వీరెవరూ ముస్లిములు కారు.

రెండవ ప్రపంచ యుధ్దము తరువాత పాలస్తీనా లో హగన, ఇర్గున్ మరియు స్టెర్న్ గ్యాంగ్ మొదలగు యూదు ముఠాలు తమకు ప్రత్యేక యూదు డేశము కావాలని పోరాడారు. వీళ్ళు హోటళ్ళను బాంబులతో పేల్చేవారు. సామాన్య ప్రజానీకాన్ని చంపేవారు. ఆ సమయంలో పాలస్తీనాను పాలిస్తున్న బ్రిటీషువారు హగన, ఇర్గున్ మరియు స్టెర్న్ గ్యాంగ్ మొదలగు యూదు ముఠాలను ఉగ్రవాద ముఠాలుగా పరిగణించారు.

ఆ విధంగా ఉగ్రవాదులైన మొషె దయాన్, ఇత్జాక్ రాబిన్, మెనచెం బెకిన్ మరియు ఎరియల్ షరాన్ మొదలగు వారు తరువాత కాలంలో స్వతంత్ర ఇస్రాయిల్ కు నాయకులు అయినారు.

ఆశ్చర్యం ఏమిటంటే, తమను ఉగ్రవాదులుగా పిలవటాన్ని అసహ్యించుకున్న ఈ మాజీ ఉగ్రవాదులే, తాము ఏ విధంగానయితే ఒకప్పుడు స్వతంత్ర దేశం కోసం పోరాడారో అలాగే ఇప్పుడు తమ దేశం కోసము పోరాడుతున్న (పాలస్తీనా) అరబ్ ప్రజానీకానికి ప్రత్యేకంగా ఉగ్రవాదం అనే పేరును అంటగట్టడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.

జర్మనీలో 1968-1992 మధ్యకాలంలో బాదెర్ మైన్ హఫ్స్ అనే ముఠా జర్మన్ ప్రైవేటీకరణ ఏజెన్సీ ట్రీహ్యాండ్ అధినేతతో సహా వందల సంఖ్యలో ప్రజలను ఊచకోత కొశారు.


ఇటలీలోని రెడ్ బ్రిగేడ్స్ అప్పటి మాజీ ప్రధానమంత్రి ఆల్డోమొరోని అపహరించి చంపారు.

ఆసియా ఖండంలో ఇటలీ రెడ్ బ్రిగేడ్ వంటి ఒక ఉగ్రవాద సంస్థ -- జపనీస్ రెడ్ ఆర్మి.

జపాన్ లోని ఆంషిన్రిక్యో అనే బౌధ్ధమత తెగ 1995 లో టొక్యో మెట్రో సిస్టంలో వేల సంఖ్యలో సామాన్యులను నర్వ్ గ్యాస్ అనే రసాయన పదార్ధం ద్వారా చంపటానికి ప్రయత్నించారు.

యూరప్ లో సుమారు వంద సంవత్సరాలనుంచి ఐరిష్ రిపబ్లికన్ ఆర్మి అనే కాథలిక్ సంస్థ ఉగ్రవాద సంస్థ. స్పెయిన్ మరియు ఫ్రాన్స్ దేశాలకు ఉగ్రవాద సంస్థ అయిన ఈటీఏ -- బాస్క్ ఉగ్రవాద సంస్థ నుంచి ఉగ్రవాద ముప్పు ఉన్నది.

ఆఫ్రికా ఖండం అంతర్యుధ్దాలటో అంతఃకలహాలతో అతలాకుతలం అయింది. ఎన్నో సంస్థల్లో వేటిని ఉగ్రవాద సంస్థలు అనాలో కూడ కష్టమై పోయింది. ఈ ఉగ్రవాద సంస్థలు మొత్తం ఆఫ్రికా ఖండంలో వ్యాపించి ఉన్నాయి. వాటిలో కెల్లా అత్యంత ప్రఖ్యాతి గాంచినది ఉగాండాలోని లార్డ్స్ సాల్వేషన్ ఆర్మి అనే క్రైస్తవ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ చిన్న పిల్లలను సైతం యుధ్దాలకు ఉపయోగిస్తుంది.

శ్రీలంక లోని తమిళ టైగర్లను ప్రపంచంలో కెల్ల అత్యంత భయంకరమైన ధుర్మార్గపూరితమైన ఉగ్రవాద గుంపు గా పరిగణించవచ్చు. చిన్న పిల్లలకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన మొట్టమొదటి సంస్థ -- తమిళ టైగర్లు(ఎల్ టీ టీ ఈ).


వీరు హిందువులు.

నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆత్మాహుతి దాడులన్నిటినీ పాలాస్తీనా మరియు ఇరాకీ ముస్లిములకు అంటగడుతున్నారు. కాని ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా భారీ స్థాయిలో ఇటువంటి కుచేష్టలకు పాల్పడిన ఘనత తమిళ టైగర్లదే.

1991 లో భారత దేశమాజీ ప్రధానమంత్రి అటువంటి ఆత్మాహుతి దాడులవలనే చంపబడ్డారు. భారతదేశం లో ఉన్న ఎన్నో మిలిటెంట్ సంస్థలలో కాశ్మీరి మిలిటెంట్లు మాత్రమే ముస్లిములు.

భింద్రన్ వాలె నాయకత్వంలో పనిచేసే పంజాబీ మిలిటెంట్లు సిఖ్ఖులు.

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనే ఉగ్రవాద సంస్థ ముస్లిములను మాత్రమే చంపటానికి పని చేసే సంస్థ.

త్రిపురలో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉనికిలోకి వచ్చి కనుమరుగైపోయాయి.

అస్సాంలో ఎన్నో సంవత్సరాలుగా వేళ్ళూనుకొని ఉన్న సంస్థ -- అస్సాం బోడోస్.

క్రైస్తవులైన మిజోలు ఎన్నో సంవత్సరాలుగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి నించున్నాయి. క్రైస్తవులైన నాగాలు ఎన్నో ఉగ్రవాద సంస్థలను నడుపుతున్నారు.

భారతదేశంలో ఉన్న ఇటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటికెల్లా అత్యంత ప్రధానమైనది -- మావొయిస్టు ఉగ్రవాదసంస్థ. మావొయిస్టులు భారతదేశంలోని 600 జిల్లాల్లో సుమారుగా 150 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. మావొయిస్టులు దాడులు చేసి ఎన్నో పొలీస్ స్టేషన్ లు పేల్చివేశారు. మరియు వీరికి సహకరించని ఎన్నో గ్రామాలను సర్వ నాశనం చేశారు.

వీరు లౌకికవాద ఉగ్రవాదులు.(బాదెర్ మైన్ హాఫ్ లేక రెడ్ బ్రిగేడ్ లాగా)

సభ్యత్వపరంగా గాని, నియంత్రిత ప్రాదేశిక పరంగా గాని లౌకికవాద ఉగ్రవాదులైన మావొయిస్టులు ముస్లిం ఉగ్రవాదుల కన్న ఎన్నో రెట్లు అధికంగా ఉన్నారు.

దీని వలన ఉగ్రవాదము అనేది ముస్లిముల గుతాధిపత్యము కాదు అని మనకు బోధపడుతుంది. తరచి చూస్తే క్రైస్తవులలో, యూదులలో, హిందువులలో, సిఖ్ఖులలో మరియు బుధ్ద మతస్థులలో కూడ మనకు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. లౌకికవాద ఉగ్రవాదుల(అరాచకవాదులు, మావొయిస్టులు) వలన ప్రపంచానికి ఎనలేని హాని జరిగింది.

అలాంటప్పుడు ఎందుకు ఉగ్రవాదులు అందరూ ముస్లిములే లేక ఎక్కువమంది ఉగ్రవాదులు ముస్లిములే అనే భావన సర్వత్రా వ్యక్తమౌతుంది.

నాకు రెందు కారణాలు బోధపడుతున్నాయి.

మొదటిది, భారతీయ మేధావి వర్గం పాశ్చాత్య మీడియాను గుడ్డిగా అనుకరిస్తోంది.

రెండవది, మరోవైపు పాశ్చాత్య ప్రపంచం తనకు ఇస్లాం వల్ల ఇస్లామిక్ సంస్థల వల్ల ముప్పు ఉన్నదని చీటికి మాటికీ ఉలిక్కి పడుతోంది.

క్రైస్తవ ఐరిష్ ఉగ్రవాదులు బ్రిటన్ లోముస్లిముల కంటే చాలా ఎక్కువ మందిని తమ ఉగ్రవాద చర్యల వలన చంపారు. అయిననూ యూరోపియన్లకు లండన్ మరియు మ్యాడ్రిడ్ లోని సబ్ వే బాంబింగులు మాత్రమే ఎందుకు గుర్తున్నాయి. బాదెర్ మైన్ హాఫ్ గ్యాంగ్, ఐ ఆర్ ఏ మరియు రెడ్ బ్రిగేడ్ వలన భయము లేదు కాని 9/11 తరువాత అమెరికన్లు మరియు యూరోపియన్లకు ఎక్కడైన ఏ క్షణమైన ఉగ్రవాదులు తమపై దాడులకు తెగబడవచ్చనే భయం పట్టుకున్నది.

ఇప్పుడు వారి దృష్టి మొత్తం ఇస్లామిక్ ఉగ్రవాదం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆఫ్రికా, శ్రీలంక మరియు భారతదేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల పై వారి దృష్టి ఏ మాత్రం లేదు. ఈ సంస్థల వలన వీరికి ముప్పు కనబడటం లేదు.

భారతదేశంలో ముస్లిం మిలిటెంట్ల కన్నా మావొయిస్టులు మహాభయాన్ని రగుల్పుతున్నారు. వీరు 150 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు అంటే యావత్ భారతావనిలో మూడోవంతు భాగంలో నన్నమాట. అయిననూ మహానగరాలు ముస్లిం సంస్థల వలననే ప్రమాదము పొంచి ఉన్నదని భావిస్తాయి.

కనుక జాతీయ మేధావివర్గం, మీడియా అంత కూడా ముస్లిం ఉగ్రవాదం పైనే తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించారు.
ఏమో! ఇంత పెద్ద మేధావుల బుధ్ధి కూడా ఈ విషయానికి వచ్చేసరికి తికమకపడుతోంది. ఏం చేస్తాం? దురదృష్టం?

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

సృష్టిని ఆరాధించాలా? "సృష్టికర్త"ను ఆరాధించాలా?

సృష్టి ప్రారంభం నుంచి నేటిదాకా ఈ యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు. ఇది నిజం. సృష్టిచరిత్రలో ఎన్నటికీ తిరుగులేని ఏకైక సత్యం.

సృష్టిని ఆరాధించాలా? "సృష్టికర్త"ను ఆరాధించాలా?

-- ఇది మానవుని జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం.
ఈ నిర్ణయం పైనే మానవుని తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక "ఆరాధన" విషయంలో మానవులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

పాఠకమహాశయులకు సృష్టిని ఆరాధించాలా లేక సృష్టికర్తను ఆరాధించాలా అనే విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం.

18, సెప్టెంబర్ 2010, శనివారం

ఇస్లాం పట్ల ఎందుకిలా జరుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించారా ?

ఇస్లాం పట్ల ఎందుకిలా జరుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించారా?

ఒక క్రైస్తవ సన్యాసిని తల నుంచి పాదాల దాక నిండు వస్త్రాలు ధరిస్తే లోకం ఆమెను గౌరవిస్తుంది. ఆమె దైవసేవ కోసం అంకితమైందని చెబుతుంది. కాని అదే ఒక ముస్లిం మహిళ నిండు వస్త్రాలు ధరిస్తే ఆమె అణచివేయబడుతోందని గగ్గోలు పెడుతుంది ఈ సమాజం. ఇస్లాం పట్ల ఎందుకీ వివక్ష ?

ఒక యూదుడు గడ్డం పెంచితే అతను తన నమ్మకాన్ని
ఆచరిస్తున్నవాడౌతాడు. కాని అదే ఒక ముస్లిం గడ్డం పెంచితే అతన్ని తీవ్రవాదిగా ఎంచుతారు. ముస్లింల పట్ల ఎందుకింత దురనుమానం?

ఒక పాశ్చాత్య మహిళ ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటే ఆమె తన కుటుంబానికి మేలు చేస్తున్నత్యాగమూర్తి. మరి అదే ఒక ముస్లిం మహిళ అలా చేస్తే దిక్కులు పిక్కటిల్లేలా "కుటుంబ బానిసత్వం నుంచి ఆమెకు విముక్తి కల్పించాలి" అని నినాదాలు. ముస్లిం మహిళ విషయంలో ఏమిటీ వైపరీత్యం ?

తమ సబ్జెక్టు పై సాధన చేసే విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందంటారు. కాని ఇస్లాం కోసం శ్రమించే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయమని నిరుత్సాహపరుస్తారు. ఇస్లాం పై ఎందుకింత కుల్లుబోతుతనం?

ఒక యూదుడు కాని క్రైస్తవుడు కాని హత్య చేస్తె అప్పుడు వారి మతం గురించి ఎవరూ మాట్లాడరు. కాని అదే ఒక ముస్లిం ఏదైనా నేరం క్రింద పట్టుబడితే అందరూ అతని మతాన్నే ఆడిపోసుకుంటారు. ఇస్లాం అంటె ఎందుకింత చులకన?

ఇతర అమ్మాయిలు తమకు ఏ దుస్తులు నచ్చితే ఆ దుస్తులు ధరించి విద్యాలయాలకు వెళ్ళవచ్చు. వారికి ఆ స్వేచ్చా స్వాతంత్రాలు ఉన్నాయి. కాని ఒక ముస్లిం అమ్మాయిలకు మాత్రం ఆ భాగ్యం లేదు. వారు నిండు దుస్తులు ధరించి కాలేజీలకు వెళితే యాజమాన్యాలు వారిని లోనికి రానీయరు. ఏమిటీ అన్యాయం?

ఒక వ్యక్తి ఎంతో మంది పరుల జీవితాలకోసం శాంతియుగమార్గంలో తన జీవితాన్ని త్యాగం చేసుకుంటే అతను గొప్పవాడు, గౌరవార్హుడు. కాని అదే ఒక ముస్లిం శాంతియుతమార్గంలో తన కుమారుడ్ని శత్రువుల చెరనుంచి కాపాడుకోవటానికి, తన సోదరుల చేతులు తెగిపోకుండ ఆదుకోవటానికి, తన అమ్మలక్కల మానాభిమానాలను రక్షించటానికి, తన ఇల్లు ధ్వంసం కాకుండ ఆపటానికి, తన మస్జిదుల గౌరవం కాలరాయబడకుండ కాపాడటానికి ఆ పని చేస్తే అతను ఉగ్రవాది. ఎంత దౌర్జన్యం?

మనకు ఏవైన సమస్యలు ఎదురైతే వాటికి ఏ పరిష్కారాలు దొరికినా కళ్ళు మూసేసుకొని తీసుకుంటాము. కాని ఒక సమస్యకు పరిష్కారం ఇస్లాం ధర్మంలో మాత్రమే ఉందని తెలిస్తే అసలు కనీసం దాని వైపు చూడటానికి కూడ మనం ఇష్టపడం. ఎందుకింత దురభిప్రాయం.

ఒక అసమర్ధ డ్రైవరు లక్షణమైన కారుని అడ్డ దిడ్డంగా నడిపి ఒక రోడ్డు ప్రమాదానికి పాల్పడ్డాడు. అలాంటప్పుడు తప్పు కారుదని ఎవరైన అనగలరా?. కాని అదే ఒక ముస్లిం తప్పు చేస్తే ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ప్రజలు అక్కడ వేలెత్తి చూపేది ఇస్లాం వైపు. మరీ ఇంత అనాలోచితమా?

ఇస్లామీయ చట్టాలను ఒక్క మారైన పరిశీలించకుండ పాశ్చాత్య మీడియా తాన అంటే తందాన అంటు తలాడిస్తోంది మన చుట్టూ ఉన్న ఈ సమాజం. అతి కొద్దిమందికి తప్పితే ఖురాన్ ఏమి చెబుతుంది? ప్రామాణిక హదీసుల్లో ఏముంది? అని తెలుసుకోవాలన్న జిఙ్ఞాస ఎవరికీ లేదు.

ఇదంతా ఎందుకు ? కేవలం ముస్లిం అయినందుకేనా ?
కాని ఇలా చేసేవారిని ఒక విచిత్రం ఎగతాళి చేస్తోంది సుమా!
మీరు గమనించారో లేదో!

ఎవరు ఎంత దుష్ప్రచారం చేస్తున్నప్పటికి ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ధర్మం ఇప్పటికీ ఇస్లామే.