దైనందిన జీవితంలో "ప్రార్ధన" కు గల ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రతి రోజూ మనం చేస్తూ ఉండే సకల ఆరాధనల సారం ప్రార్ధన. ఆపదలు ఎదురైనప్పుడు ప్రార్ధనలు చేయటం సామాన్యుల లక్ష్యం. ఎలాంటి ఆపదలు లేక పోయినా తమ ప్రభువును ప్రార్ధించటం ఉత్తముల విధానం. అలాంటి పుణ్యత్ములే అల్లాహ్ కు అత్యంత ప్రీతి పాత్రులైన దాసులు. అల్లాహ్ అనుగ్రహానికి అర్హులు. కేవలం కష్టాలు, సుఖాల్లోనే కాదు, ప్రార్ధన మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దువాలు చేసుకోవటం ఒక దైనందిన అలవాటుగా మారిపోవాలి. ఉదయం సాయంత్రం నియమం తప్పకుండ వేడుకోలు వచనాలు పఠిస్తూ ఉండాలి. అదే జరిగితే, మన జీవితాల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. రేయింబవళ్ళు అల్లాహ్ రక్షణలో గడుపుతున్న అపూర్వమైన అనుభూతిని మనం పొందుతాం. ఉదయం పూట అల్లాహ్ వేడుకోలు వచనాలతో మొదలైన మన దినచర్యలు సాయంత్రానికి సకల శుభాలతో, శ్రేయాలతో ముగుస్తాయి. ఆ రోజంతా మన విశ్వాసంలో, ఆచరణల్లో తాజాదనం ఉంటుంది.
ఉదయం - సాయంత్రం ప్రార్ధనలు
2, డిసెంబర్ 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)